Sharad Pawar Abdullah : ప్రమాణ స్వీకారంలో పవార్..ఫరూక్
హాజరైన రాజకీయ దిగ్గజ నేతలు
Sharad Pawar Abdullah : కర్ణాటకలోని బెంగళూరు కంఠీరవ స్టేడియంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది కర్ణాటక నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరు కావడం విశేషం. ప్రముఖ నటులు శివ రాజ్ కుమార్ , కమల్ హాసన్ , దునియా విజయ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక రాజకీయ దురంధరుడిగా పేరు పొందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar Abdullah) తో పాటు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి ఒకే వేదిక పైకి రావాలని పిలుపునిచ్చారు.
ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , సీఎంలు అశోక్ గెహ్లాట్ , భూపేష్ బఘేల్ , ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి కావాలని పిలువలేదు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ సీఎం జగన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లను. ఈ ముగ్గురు బీజేపీకి, మోదీ, అమిత్ షాకు తేబేదారులుగా మారారని ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే హాజరయ్యారు.
Also Read : MK Stalin DK Shiva Kumar