Sharad Pawar : ఓ వైపు మహారాష్ట్రలో దాడులు, అరెస్ట్ లకు తెర తీశాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఈడీ మినిష్టర్ నవాబ్ మాలిక్ ను అదుపులోకి తీసుకుంది.
మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రే బావ మరిదికి చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా శివసేనకు వాయిస్ గా ఉంటూ కేంద్ర సర్కార్ పై మోదీపై నిప్పులు చెరుగుతూ వస్తున్న ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ తనయుడు, భార్యకు చెందిన రూ. 11 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఇవాళ మరాఠా సర్కార్ లో ఉంటూ మనీ లాండరింగ్ కేసు నమోదై, ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈ తరుణంలో మహారాష్ట్రలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)బుధవారం ఉన్నట్టుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
దాదాపు వీరిద్దరూ 20 నిమిషాలకు పైగా సమావేశం అయ్యారు. ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా పవర్ , ప్రధానితో భేటీ కావడం సంచలనం సృష్టించింది.
పార్లమెంట్ లోని ప్రధాని మోదీ ఆఫీసులో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్రంలో అధికారంలో ఉన్న శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమి నేతలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చర్చల్లో ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా భేటీ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్. తనకు ఏమీ తెలియదని చెప్పారు. అభివృద్ది పనులపై దేశ ప్రధాని, ఓ జాతీయ అధ్యక్షుడు సమావేశం కావడం తప్పు లేదన్నారు.
Also Read : పరువునష్టం కేసులో నటి రోజా భర్తపై అరెస్ట్ వారెంట్