Sharad Pawar : రాష్ట్రపతి రేసులో శరద్ పవార్
ఎన్సీపీ చీఫ్ కు కాంగ్రెస్ మద్దతు
Sharad Pawar : భారత దేశ అత్యన్నత పదవిగా భావించే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ చేసింది.
ఈనెల 15న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. వచ్చే నెల జూలై 18న పోలింగ్ జరుగుతుంది. 21న ఫలితాలు వెల్లడి అవుతాయి. ఇప్పటికే పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి.
ఇక అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, గెలిపించు కోవడం అన్నది మోదీ త్రయానికి అగ్నిపరీక్షగా మారింది.
ఇక బీజేపీ తరపున వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్ , తమిళి సై సౌందర రాజన్ తో పాటు మరో ఇద్దరి పేర్లు పరిశీలిస్తోందని సమాచారం.
బీజేపీ ఎంపిక చేసినా దానిని తుది ఎంపిక చేయాల్సింది మాత్రం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇది పక్కన పెడితే గెలవాలంటే ఇంకా 8 వేల ఓట్లు సాధించాల్సి ఉంటుంది ఎన్డీయే కూటమికి.
ఇప్పుడు ప్రతిపక్షాలు అత్యంత బలంగా ఉన్నాయి. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు కొనసాగుతోంది. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే, బీహార్ జేడీఎస్ దూరంగా ఉన్నాయి.
దీంతో భారీగా ఓట్లు రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఏకాభ్రియానికి వచ్చాక ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇందులో భాగంగా గులాం నబీ ఆజాద్ తో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్(Sharad Pawar) పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. మరో వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read : బెంగాల్ లో యూనివర్శిటీలకు సీఎం సుప్రీం