Sharad Pawar Modi : మోదీ మౌనం దేశానికి శాపం – పవార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పవార్ ఫైర్
Sharad Pawar Modi : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిప్పులు చెరిగారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోందని కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం మౌనం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. గురువారం శరద్ పవార్(Sharad Pawar) మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకు బతకలేని పరిస్థితులు దాపురించాయని దీనికి ప్రధాన కారణం అనాలోచిత నిర్ణయాలేనని మండిపడ్డారు.
ఉద్యోగాలు లేక పోవడంతో నిరుద్యోగులకు పెళ్లిళ్లు కావడం లేదని శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్యన ఉన్నవారే అత్యధికంగా ఉన్నారని పేర్కొన్నారు ఎన్సీపీ చీఫ్.
ఇటీవల తాను పనిమీద ప్రయాణం చేస్తుండగా చాలా మంది యువకులు తనను కలుసుకున్నారని, జాబ్స్ లేని కారణంగా తమకు మ్యారేజేస్ కావడం లేదని చెప్పారని ఇది నేటి నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో తెలియ చేస్తుందని చెప్పారు శరద్ పవార్.
దేశంలో అపారమైన వనరులు ఉన్నాయని వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోగలిగితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జాబ్స్ ఇవ్వ వచ్చని స్పష్టం చేశారు కేంద్ర మాజీ మంత్రి. కేవలం జాబ్స్ చేయక పోవడం కారణంగా పిల్లల్ని ఇచ్చేందుకు పేరెంట్స్ ముందుకు రావడం లేదన్నారు.
ఇకనైనా ప్రధానమంత్రి తన ప్రచార ఆర్భాటాన్ని తగ్గించుకుని ప్రజలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు శరద్ పవార్(Sharad Pawar) .
ఇప్పటికే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను నిర్వీర్యం చేయడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.
Also Read : బిల్కిస్ బానో కేసు మరోసారి జాబితాకు