Sharad Pawar Resign : ఎన్సీపీ అధ్యక్ష పదవికి గుడ్ బై
ప్రకటించిన శరద్ పవార్
Sharad Pawar Resign : మరాఠాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మహా వికాస్ అఘాడీలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ కేంద్ర మంత్రి , ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తాను రాజీనామా(Sharad Pawar Resign) చేస్తున్నట్లు తెలిపారు.
శరద్ పవార్ చేసిన ప్రకటన కలకలం రేపింది. తీవ్ర చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా ఎన్సీపీలో అంతర్గత విభేదాలు పొడ సూపాయి. చివరకు అధినేత రాజీనామా చేసే స్థితికి దారి తీసింది. తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ఎన్సీపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని ఆ మధ్య అజిత్ పవార్ ఖండించారు. ఈ నేపథ్యంలోనే శరద్ పవార్ చేసిన ఈ ప్రకటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా పవార్ తీసుకున్న నిర్ణయంపై ఆవేదన చెందుతున్నారు ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు. వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. శరద్ పవార్ ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. విచిత్రం ఏమిటంటే తన పార్టీనే తాను కంట్రోల్ చేసుకోలేక పోవడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా శరద్ పవార్(Sharad Pawar) వెనక్కి తగ్గుతారా లేదంటే రాజీనామా కూడా రాజకీయంలో ఒక భాగమా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు – కాంగ్రెస్