Sajjala Ramakrishna Reddy : ష‌ర్మిల అరెస్ట్ దుర‌దృష్ట‌క‌రం

స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి

Sajjala Ramakrishna Reddy : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డించేందుకు బ‌య‌లు దేరిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్‌, దివంత‌గ‌త సీఎం వైఎస్సార్ త‌న‌యురాలు వైఎస్ ష‌ర్మిల‌ను మంగ‌ళ‌వారం బ‌ల‌వంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు.

పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌పై లాఠీలు ఝులిపించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీసులు, టీఆర్ఎస్ నేత‌లు గూండాల‌ని అన్నారు. భార‌త రాష్ట్ర స‌మితి కాద‌ని బందిపోట్ల స‌మితి అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తాను ప్ర‌జ‌ల కోసం పాద‌యాత్ర చేస్తున్నాన‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 3,500 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేశాన‌ని స్ప‌ష్టం చేశారు. తాను వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినీ దూషించ లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా వైఎస్ ష‌ర్మిల‌ను అరెస్ట్ చేయ‌డంపై స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందించారు.

ఆయ‌న మీడియాతో మాట్లాడ‌రు. వైఎస్ ష‌ర్మిల దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురుగా, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోద‌రిగా తాము బాధ ప‌డుతున్నామ‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ పాద‌యాత్ర చేసే హ‌క్కు ఉంటుంద‌న్నారు. తాము కూడా పాద‌యాత్ర చేప‌ట్టి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు.

కానీ ఇలా మ‌హిళ అని చూడ‌కుండా అరెస్ట్ చేయ‌డం భావ్యం కాద‌న్నారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. ఆమె అరెస్ట్ ను తాము ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు నాయుడుకు పొద్దున లేస్తే అమ‌రావ‌తి రాజ‌కీయం త‌ప్ప ఇంకేదీ లేద‌న్నారు.

Also Read : ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి..ష‌ర్మిల అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!