K Sudhakaran : కాంగ్రెస్ చీఫ్ పోటీకి శశి థరూర్ అర్హుడే
కేరళ పార్టీ చీఫ్ కె. సుధాకరన్ కామెంట్స్
K Sudhakaran : 134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో గాంధీ ఫ్యామిలీ వర్సెస్ గాంధీయేతర నేతల మధ్య పోటీ నెలకొంది.
ఇప్పటికే 50 ఏళ్ల అనుబంధం కలిగిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పారు. ఆయన అసమ్మతి వర్గం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు.
ఈ టీంలో కేరళ లోని తిరువనంతపురం కు చెందిన రాజ్యసభ ఎంపీ శశి థరూర్ కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు వార్తల్లో నిలిచారు. హాట్ టాపిక్ గా మారారు.
కేరళకు చెందిన ప్రముఖ పత్రిక మాతృభూమిలో వ్యాసం రాశారు. ఇందులో పార్టీ చీఫ్ పదవి కోసం తాను కూడా బరిలో ఉన్నానని పేర్కొన్నాడు.
అంతే కాదు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరాడు. దీనిని సమర్థిస్తూ కీలక కామెంట్స్ చేశాడు కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కె. సుధాకరన్(K Sudhakaran).
శశి థరూర్ అత్యంత అనుభవం కలిగిన నాయకుడు. ఆయనకు పోటీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశాడు. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన పని లేదన్నాడు.
కాగా శశి థరూర్ బరిలో ఉంటారా ఉండరా అన్నది ఆయన ఇష్టం. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. కాక పోతే ఆయన పోటీలో ఉండరని, అవన్నీ ఊహాగానాలేనని అనుకుంటున్నట్లు తెలిపాడు కె. సుధాకరన్.
ఒకవేళ పోటీ చేయాలని అనుకుంటే నిందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
Also Read : దేశానికి కర్ణాటక అవినీతి రాజధాని – డీకే