Shashi Tharoor : 30న శ‌శి థ‌రూర్ నామినేష‌న్ దాఖ‌లు

కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప‌ద‌వికి 17న ఎన్నిక‌

Shashi Tharoor : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీలో అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి ఎన్నిక‌ల కోలాహాలం నెల‌కొంది. అక్టోబ‌ర్ 17న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ జారీ చేశారు.

ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ గా మ‌ధుసూద‌న్ మిస్త్రీ ఉన్నారు. పార్టీకి సంబంధించి రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు సీనియ‌ర్ నాయ‌కులు మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ , దిగ్విజ‌య్ సింగ్, ముకుల్ వాస్నిక్ తో పాటు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కూడా బ‌రిలో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా పోటీ అశోక్ గెహ్లాట్ , శ‌శి థ‌రూర్ మ‌ధ్య‌న ఉండ‌నుంది.

మొత్తం 9,000 మంది స‌భ్యులు ఓటు హ‌క్కు వినియోగించు కోనున్నారు. సెప్టెంబ‌ర్ 30 ఆఖ‌రు తేదీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి నామినేష‌న్ దాఖ‌లు చేసుకునేందుకు. తిరువ‌నంత‌పురం ఎంపీగా ఉన్న శ‌శి థ‌రూర్(Shashi Tharoor) పార్టీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

ఇప్ప‌టికే ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియో గాంధీని క‌లిశారు. ఆపై తాను పోటీలో ఉన్న‌ట్లు చెప్పారు. ఆయ‌న వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ‌శి థ‌రూర్ కు సంబంధించి 30న నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేయనున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న సూచ‌న ప్రాయంగా ప్ర‌క‌టించారు.

17న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 19న ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు. ఎన్నిక‌ల అథారిటీ చైర్మ‌న్ మ‌ధుసూద‌న్ మిస్త్రీతో శ‌శి థ‌రూర్(Shashi Tharoor) సంభాషించారు. ఎన్నిక‌లు స‌జావుగా సాగేలా చూడాల‌ని కోరారు. ఎన్నిక‌ల ఫారాలతో పాటు ఓటు హ‌క్కు క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రికి గుర్తింపు కార్డుల‌ను అంద‌జేసిన‌ట్లు తెలిపారు.

Also Read : కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో లేను – క‌మ‌ల్ నాథ్

Leave A Reply

Your Email Id will not be published!