Shashi Tharoor : భారత్ పై శశి థరూర్ కామెంట్స్
అది ప్రతిపక్ష కూటమికి చెందిన పేరు
Shashi Tharoor : న్యూ ఢిల్లీ – కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం తాజాగా ఇండియా పేరును మారుస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో భారత్ ను చేరుస్తున్నట్లు స్పష్టం చేసింది. జి20 శిఖరాగ్ర సమావేశం సందర్బంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో అన్ని దేశాలకు ఆహ్వానం పంపింది.
Shashi Tharoor Comments Viral
దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. మోదీ, బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని 28 పార్టీలన్నీ కలిసి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. దీనిని తట్టుకోలేకే మోదీ ఇండియా పేరును మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ తరుణంలో ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) షాకింగ్ కామెంట్స్ చేశారు.
భారత్ ను ప్రతిపక్ష కూటమిగా అభివర్ణించారు. భారత్ అని పిలిచేందుకు రాజ్యాంగ పరంగా ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ వెల కట్ట లేని బ్రాండ్ వాల్యూ మాత్రం ఇండియా పేరు మీదే ఉందన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు శశి థరూర్. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : IND vs PAK Asia Cup 2023 : దాయాదుల మ్యాచ్ కు టికెట్స్ క్లోజ్