Shashi Tharoor : బీజేపీలోకి నేతలు వెళ్లకుండా అడ్డుకుంటా
స్పష్టం చేసిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Shashi Tharoor : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేపుతోంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక. సుదీర్ఘ కాలం తర్వాత 134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు 20 ఏళ్ల అనంతరం గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. అక్టోబర్ 17న సోమవారం కీలక పదవికి పోలింగ్ జరగనుంది.
19న ఫలితం వెల్లడిస్తారు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకించి కీలకమైన రూల్స్ కూడా విధించారు. పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఆఫీస్ బేరర్లు, ఇతర ఉన్నత పదవులలో ఉన్న వారు తమ తమ ప్రాంతాల (రాష్ట్రాలు)లోనే ఓటు వేయాలని సూచించారు.
ఒకవేళ అలా కాని పక్షంలో ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో తమ ఓటు వేయాలని స్పష్టం చేశారు. మొత్తం 9 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా బరిలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను గనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో ఎక్కువ మంది అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.
ఉదయ్ పూర్ డిక్లరేషన్ తో పాటు హైకమాండ్ కల్చర్ అనేది లేకుండా చేస్తానని చెప్పారు. తనకు పోటీగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా పార్టీ కోసం పని చేయాల్సిందేనని పేర్కొన్నారు.
Also Read : యోగి ఏరియల్ సర్వేపై వరుణ్ గాంధీ ఫైర్