Shashi Tharoor : ఎన్నిక నిర్వ‌హ‌ణ‌పై కామెంట్స్ క‌ల‌క‌లం

మ‌ధుసూద‌న్ మిస్త్రీని కావాల‌ని అన‌లేదు

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో ప్ర‌స్తుతం శ‌శి థ‌రూర్ కాకా రేపుతున్నారు. ఆయ‌న ఇప్పుడు మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా మారి పోయారు. అటు పార్టీలో ఇటు ప్ర‌తిప‌క్షాల‌లో ప్ర‌ధానంగా బీజేపీలో కూడా హాట్ టాపిక్ గా మారి పోయారు. విచిత్రం ఏమిటంటే శ‌శి థ‌రూర్ మొద‌టి నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్ర‌క్షాళ‌న కోరుకుంటున్నారు.

పార‌ద‌ర్శ‌క‌త‌తో ఎన్నిక‌లు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. అంతే కాదు హై క‌మాండ్ క‌ల్చ‌ర్ అనేది పోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 2020లో ఆయ‌న పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. మ‌రో వైపు అక్టోబ‌ర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఈ సంద‌ర్భంగా ఈ ఎన్నిక‌ను ఏక‌ప‌క్షంగా కాకుండా స్వేచ్ఛ‌గా ప్ర‌తి ఒక్క‌రు ఓటు వేసేలా, వినియోగించుకునేలా చూడాల‌ని కోరుతున్నారు. ఆయ‌న‌కు పోటీగా గాంధీకి విధేయుడిగా ఉన్న క‌ర్ణాట‌క‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) ఉన్నారు. ప్ర‌స్తుతం శ‌శి థ‌రూర్, ఖ‌ర్గే మ‌ధ్య పోటీ నెల‌కొంది.

గురువారం శ‌శి థ‌రూర్(Shashi Tharoor) మీడియాతో మాట్లాడారు. ఎవ‌రైనా స‌రే వారి వారి ప్రాంతాల‌లో ఓటు వేసేలా చూడాల‌ని కోరారు. ఎక్క‌డా పొర‌పాట్లు అన్న‌వి ఉండ‌కూడ‌ద‌ని కోరారు. పార్టీలో లోపాల‌ను తాను ఎత్తి చూపుతున్నాన‌ని, ఇది త‌న బాధ్య‌త అని పేర్కొన్నారు.

తాను కావాల‌ని ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీని టార్గెట్ చేయ లేద‌ని స్ప‌ష్టం చేశారు శ‌శి థ‌రూర్. ఎన్నిక ప్రజాస్వామ్య స్పూర్తిని క‌లిగించేదిగా ఉండాల‌ని కోరారు. ఇంత‌కంటే మించి తాను ఏమీ కోరుకోవ‌డం లేద‌న్నారు.

Also Read : తీర్పు వ‌చ్చే వ‌ర‌కు హిజాబ్ పై నిషేధం

 

Leave A Reply

Your Email Id will not be published!