Shashi Tharoor : శశి థరూర్ మేనిఫెస్టో విడుదల
రాష్ట్రాల చీఫ్ ల పదవీకాలం తగ్గింపు
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రచారంలో దూకుడు పెంచారు. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు ప్రకటిస్తారు. పోటీదారుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, తదితర రాష్ట్రాలలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఆయన కేరళలో ప్రచారం చేపట్టారు. ఇవాళ శశి థరూర్(Shashi Tharoor) చెన్నైలో ఉన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే పార్టీ పరంగా ఏం చేస్తాననే దానిపై ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశంలోని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ కార్యవర్గం లేదా చీఫ్ ల పదవీ కాలం తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పరిమితం చేయాలని సూచించారు. పార్టీ ఎప్పటి లాగే ఉండాలని అనుకుంటే మల్లికార్జున్ ఖర్గేను ఎన్ను కోవాలని లేదంటే పార్టీలో సంస్కరణలు, మార్పులు కావాలంటే తనను గెలిపించాలని కోరారు శశి థరూర్. పార్టీకి సంబంధించి తాను ఎందుకు పోటీ చేస్తున్నాననో, తన ప్రయారిటీ ఏమిటో అనే దానిపై మీడియాతోత మాట్లాడారు.
తాను పోటీలో ఉన్నానని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు శశి థరూర్. తనకు వివిధ వర్గాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని చెప్పారు.
పార్టీని పునరుజ్జీవింప చేయండి. దానిని తిరిగి శక్తివంతం చేయండి. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. అంతకంటే ఎక్కువగా అధికారాన్ని వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందంటూ తన మేనిఫెస్టో గురించి స్పష్టం చేశారు.
Also Read : రాహుల్ గాంధీ వెంట సిద్దరామయ్య రన్