Shashi Tharoor : ఖుష్బూ సుందర్ కు శశి థరూర్ కితాబు
రైట్ వింగ్ కంటే సరైనదని కామెంట్
Shashi Tharoor : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేయడం. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి.
యావజ్జీవ కారాగార శిక్షకు గురైన 11 మంది దోషులను ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చిన రోజున భారతీయ జనతా పార్టీకి చెందిన గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.
శిక్షా కాలంలో వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ 6 వేల మందికి పైగా సంతకాలతో కూడిన లేఖను దేశ ప్రధాన న్యాయమూర్తికి పంపించారు.
సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు దోషుల విడుదలపై సీరియస్ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. దానికి గల కారణాలు ఏంటో చెప్పాలని కోరింది.
తాజాగా దోషులను విడుదల చేయడాన్ని భారతీయ జనతా పార్టీకి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తప్పు పట్టారు. దోషులకు పూల దండలు వేయడం, స్వీట్లు పంపిణీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
తాజాగా బీజేపీకి చెందిన సీనియర్ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది.
ఖుష్బూను ప్రశంసలతో ముంచెత్తారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) రైట్ వింగ్ కాకుండా రైట్ థింగ్ అంటూ ట్వీట్ చేశారు. మానవ జాతి, స్త్రీత్వానికి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటువంటి ఘటనలు సభ్య సమాజాన్ని మరింత దిగజార్చేలా చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : కాంగ్రెస్ కూలి పోవడం బాధగా ఉంది
Hear hear, @khushsundar! Proud to see you standing up for the right thing, rather than the right wing. https://t.co/NPfumMD6DW
— Shashi Tharoor (@ShashiTharoor) August 26, 2022