Shashi Tharoor : శశి థరూర్ షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నికపై
Shashi Tharoor : వచ్చే అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పాడు. పలువురు ఆజాద్ తో పాటు పార్టీని వీడుతున్నారు.
ఈ తరుణంలో జి23లో కీలకమైన నాయకుడిగా పేరొందారు ఎంపీ శశి థరూర్. ఇటీవల మాతృభూమి పత్రికలో కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ వ్యాసం రాశారు.
తాను కూడా బరిలో ఉంటానని చెప్పకుండానే స్పష్టం చేశాడు. శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇదే క్రమంలో పార్టీలో అధ్యక్ష పదవితో పాటు ఇతర పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు శశి థరూర్(Shashi Tharoor).
తాజాగా మంగళవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను ఎప్పటి లాగే కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను లోపల లేదా బయట కూడా సాధారణంగా ఉండేందుకు ప్రయత్నం చేశానని తెలిపాడు శశిథరూర్.
అయితే పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో చాలా మంది కాంగ్రెస్ సభ్యులు పోటీ చేస్తారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నేను ఉంటానా ఉండనా అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు శశి థరూర్.
ఊహాగానాల మధ్య కేరళ కాంగ్రెస్ చీఫ్ కె. సుధాకరన్ మాట్లాడుతూ శశిథరూర్ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం నెలకొందని , పార్టీ అత్యున్నత పదవికి పోటీ చేసే హక్కు దాని సభ్యులకు ఉందన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పాల్గొంటే మంచిదన్నారు.
Also Read : ఆశిష్ మిశ్రా బెయిల్ పై సుప్రీం నోటీస్