Shashi Tharoor : సిసోడియా సరే యెడ్డీ మాటేంటి
మోదీ పాలనపై శశి థరూర్ ఫైర్
Shashi Tharoor Amid : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇటీవల దూకుడు పెంచడాన్ని తప్పు పట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అంటూ మండిపడ్డారు. ఆయన చెప్పింది ఏదీ చేయరన్నారు. అసలు దేశానికి దిశా నిర్దేశం చేసేందుకు కావల్సిన ఏమైనా యాక్షన్ ప్లాన్ అన్నది తయారు చేశారా అని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం చేస్తున్న పని ఒక్కటే. ఏ పని చేయకుండా ప్రచారం చేసుకోవడం. మరోటి బిజేపీయేతర రాష్ట్రాలు, నాయకులు, సంస్థలను టార్గెట్ చేసేందుకు జాబితా తయారు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.
అతను గొడ్డు మాంసం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడని ఆరోపించారు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor Amid). ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సరే మరి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ , కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పతో సహా ఎనిమిది మంది నాయకుల జాబితాను థరూర్ పంచుకున్నారు.
వారు బీజేపీ దాని మిత్రపక్షాలతో ఉన్నారని తెలిపారు. జాబితాలో ఉన్న వారిలో సువేందు అధికారి, భావ్నా గావ్లీ, యశ్వంత్ జాదవ్ , యామానీ జాదవ్ ,ప్రతాప్ సర్నాయక్ , నారాయణ్ రాణే . మనీ లాండరింగ్ , భూ స్కాంలకు పాల్పడిన నారాయణ రాణే శివసేనతో రాజకీయ జీవితం ప్రారంభించారు.
కాంగ్రెస్ లో చేరారు. కొత్త పార్టీ పెట్టారు. బీజేపీలో చేరారు. హిమంత బిస్వా శర్మ గౌహతిలో స్కాం కు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం బీజేపీ చేసింది. కానీ పార్టీలో చేరాక అవన్నీ మాఫీ అయి పోయాయని మండిపడ్డారు శశి థరూర్(Shashi Tharoor Amid).
Also Read : అస్త్రాలుగా మారిన దర్యాప్తు సంస్థలు