Shatrucharla Vijaya Rama Raju : బాబు సీఎం కావడం ఖాయం
మాజీ మంత్రి శత్రుచర్ల కామెంట్స్
Shatrucharla Vijaya Rama Raju : ఏపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామ రాజు సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు కాలం చెల్లిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని, సీఎంగా చంద్రబాబు నాయుడు కొలువు తీరుతారని జోష్యం చెప్పారు. ఆయన ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు శత్రుచర్ల విజయ రామ రాజు.
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి లోని తన నివాసంలో మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. కురుపాంలో జగన్ సభ నిర్వహించడం దారుణమన్నారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ఏనుగుల బెడద ఎక్కువగా ఉందన్నారు. చాలా సార్లు ఈ విషయం సీఎం దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించు కోలేదని శత్రుచర్ల విజయ రామ రాజు(Shatrucharla Vijaya Rama Raju) ఆరోపించారు.
రాష్ట్రంలో పలువురు రైతులు పంటల్ని కోల్పోయారు. ప్రధానంగా తమ నియోజకవర్గంలో వారి పరిస్థితి దయనీయంగా ఉందని , వారిని ఆదుకోవాల్సిన బాధ్యత జగన్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి. అమ్మ ఒడి కార్యక్రమం ఓ బక్వాస్ కార్యక్రమమని సంచలన ఆరోపణలు చేశారు శత్రుచర్ల విజయ రామ రాజు.
Also Read : Bhim Army Chief Comment : ధిక్కార స్వరంపై పేలిన తూటా