Shehbaz Sharif : పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం నెలకొంది. పీటీఐ పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస గండం ఎదుర్కొంటున్నారు.
ఒకవేళ గనుక ఆయన రాజీనామా చేసినా లేదా అవిశ్వాస తీర్మానంలో ఓడి పోయినా ఎవరు తదుపరి పీఎం కాగలరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే రాజకీయ వర్గాలు మాత్రం షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)తదుపరి పీఎం అవుతారని పేర్కొంటున్నాయి.
అంతే కాదు ఆయనే నేషనల్ అసెంబ్లీలో ఖాన్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం పాకిస్తాన్ ముస్లింగ్ లీగ్ నవాజ్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
గతంలో పాకిస్తాన్ కు దేశ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్ కు స్వయంగా సోదరుడు అవుతారు షెహబాజ్ షరీఫ్. షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.
ఈ విషయాన్ని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ తన మెజారిటీని కోల్పోయారు. అంతే కాదు అటు ప్రభుత్వ పరంగా ఆయన ఒక్క నిమిషం పీఎం పదవిలో ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొన్నాడు.
పార్లమెంట్ లో ఓటింగ్ జరుగుతుంది. పారదర్శక ఎన్నికలు, ప్రజాస్వామ్య పునరుద్దరణ అన్నది ప్రధానం కావాలని పిలుపునిచ్చారు. షరీఫ్(Shehbaz Sharif) త్వరలోనే దేశానికి ప్రధాని కాబోతున్నారని జోష్యం చెప్పారు.
పాకిస్తాన్ లో రెండు అవినీతి కేసులలో దోషిగా తేలినప్పటి నుంచి నవాజ్ షరీఫ్ లండన్ లో ఉంటున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు మూడుసార్లు సీఎంగా పని చేశారు షెహెబాజ్ షరీఫ్. అత్యధిక కాలం సీఎంగా పని చేసిన ఘనత వహించారు.
Also Read : భారత్ పై అమెరికా మండిపాటు