Shehzad Poonawalla Sonu Nigam : సోనూ నిగమ్ పై దాడి శివసేన పని
బీజేపీ స్పోక్స్ పర్సన్ పూనావల్లా ఫైర్
Shehzad Poonawalla Sonu Nigam : ముంబై లోని చెంబూరులో సంగీత కచేరిలో ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ పై దాడి జరిగింది. సెల్ఫీ కోసం వచ్చిన వ్యక్తిని నెట్టి వేయడంతో కొంత ఘర్షణ చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై సోనూ నిగమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే శివసేన పార్టీ గుర్తుపై అటు బీజేపీ , శివసేన కు మధ్య వార్ కొనసాగుతోంది. ఈ తరుణంలో సోనూ నిగమ్ పై దాడి జరగడం, ఇది పక్కా శివసేన మూకలు చేసిన దాడిగా సంచలన ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా(Shehzad Poonawalla Sonu). మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సోనూ నిగమ్ పై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా అవమానకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తెరపైకి రావడం ఇదే మొదటిసారి కాదని పేర్కొన్నారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది శివసేన అని ఆరోపించారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని నేరస్థుల గుంపుగా అభివర్ణించారు పూనావల్లా. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఈ ఘటనను సిగ్గు చేటు అని మండిపడ్డారు.
సోనూ నిగమ్ పై (Sonu Nigam) ఉద్దవ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఫాటర్ పేకర్ కుమారుడు , అతడికి చెందిన పరివారం దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూటీ వర్గం దీనిని ఖండిస్తారా అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి దాడులు మరింత ప్రమాదకరమని పేర్కొన్నారు.
సెల్ఫీ కోసం సోనూ నిగమ్ ను ప్రదర్శన తర్వాత ఎమ్మెల్యే కుమారుడు సంప్రదించేందుకు ప్రయత్నం చేశాడని , గాయకుడి సెక్యూరిటీ గార్డు తెలియక అతడిని ఆపాడని ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు.
Also Read : కచేరిలో సోనూ నిగమ్ తోసివేత