Sheikh Hasina Modi : భారత్ గురించి ఎంత చెప్పినా తక్కువే
ప్రశంసల వర్షం కురిపించిన బంగ్లా పీఎం
Sheikh Hasina Modi : భారత దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు బంగ్లా దేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా. భారత్ లో పర్యటిస్తున్న ఆమె ఇవాళ కీలకమైన వ్యక్తులను కలిశారు.
అంతే కాకుండా పీఎం మోదీతో భేటీ అయ్యారు. కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు.
ప్రస్తుతం షేక్ హసీనా నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు మోదీ, హసీనాలు(Sheikh Hasina Modi) సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ భారత దేశానికి అతి పెద్ద అభివృద్ది, వాణిజ్య భాగస్వామి అని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇద్దరూ భేటీ అయ్యారు.
యువతకు ఆసక్తి కలిగించే ఐటీ, అంతరిక్షం, అణుశక్తితో సహా వివిధ రంగాల్లో సహకారం అందించాలని భారత్, బంగ్లాదేశ్ లు నిర్ణయించు కున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
ప్రజల సహకారంతో నిరంతరం అభివృద్ది జరుగుతోందన్నారు. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య పవర్ ట్రాన్స్ మిషన్ లైన్లపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు మోదీ.
వరదల నివారణపై కూడా ప్రత్యేకంగా చర్చించామన్నారు. బంగ్లాదేశ్ తో వరదలకు సంబంధించిన నిజ సమయ డేటాను పంచుకుంటున్నామని తెలిపారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదంపై కూడా పోరాడాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు మోదీ. ఇరు దేశాలకు ఇబ్బందికరంగా మారిన ఉగ్రవాదులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇరు దేశాల పీఎంలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Also Read : భారత్ తో బంగ్లా చిరకాల స్నేహం – హసీనా