Eknath Shinde : ఉద్ద‌వ్ ఠాక్రే పై షిండే కామెంట్స్

ఆయ‌న బీజేపీతో పొత్తుకు సిద్దం

Eknath Shinde : శివ‌సేన తిరుగుబాటు నాయ‌కుడు, ప్ర‌స్తుత మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath Shinde)  షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆస‌క్తితో ఉన్నారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. గ‌త నెల‌లో ఉన్న‌ట్టుండి షిండే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. దీంతో మ‌హా వికాస్ అఘాడీ సంకీర్ణ స‌ర్కార్ రెండున్న ఏళ్ల‌కే కూలి పోయింది.

సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఆపై బీజేపీ మ‌ద్ద‌తుతో ఏక్ నాథ్ షిండే సీఎంగా కొలువు తీరారు. ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చుంటార‌ని భావించిన బీజీపీ చీఫ్ దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కు అనుకోని రీతిలో షాక్ ఇచ్చింది బీజేపీ హైక‌మాండ్ .

ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం క‌ట్ట‌బెట్టింది. ఈ త‌రుణంలో అత్య‌ధిక ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌న వైపు ఉన్నార‌ని క‌నుక అస‌లైన శివసేన పార్టీ త‌మ‌దేనంటూ కోర్టుకు ఎక్కారు సీఎం ఏక్ నాథ్ షిండే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

దీనిపై ఈసీ స్పందించింది. ఎవ‌రి బ‌లం ఏమిటో నిరూపించు కోవాల‌ని కోరుతూ ఆగ‌స్టు 8 వ‌ర‌కు డెడ్ లైన్ విధించింది. దీనిని స‌వాల్ చేస్తూ ఉద్ద‌వ్ ఠాక్రే సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఉద్ద‌వ్, షిండే పార్టీకి సంబంధించిన వివాదంపై సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాసనం త్వ‌ర‌గా నిర్ణయం తీసుకోవ‌ద్దంటూ సిఈసీని ఆదేశించింది. ఈ త‌రుణంలో షిండే ఈ వ్యాఖ్య‌లు చేయడం క‌ల‌క‌లం రేపింది.

Also Read : ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేసిన మోదీ

Leave A Reply

Your Email Id will not be published!