Shinzo Abe : చైనాపై షింజో అబే ధిక్కార స్వరం
దిగ్గజ నాయకుడిని కోల్పోయిన దేశం
Shinzo Abe : జపాన్ గొప్ప నాయకుడిని కోల్పోయింది. విద్వేషం, హింసోన్మాదం నిండిన వ్యక్తి చేతుల్లో జపాన్ దేశ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే కాల్పులకు గురయ్యాడు. ఒక రకంగా యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది.
జపాన్ ను అన్ని రంగాలలో శక్తివంతమైన దేశంగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా భారత దేశంతో ఆయన చివరి దాకా సత్ సంబంధాలు నెలకొల్పాడు.
ఇతర దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్న చైనాకు చుక్కలు చూపించాడు షింజో అబే(Shinzo Abe). చైనా వ్యతిరేక శక్తిని వెలికితీసే విషయంలో మరింత కఠినంగా మారాడు. తైవాన్ పై చైనా దాడిని తీవ్రంగా ఖండించాడు.
షింజో ప్రధాన చైనా వ్యతిరేక రాజకీయవేత్తగా మారి పోయాడు. తైవాన్ కు బేషరతుగా మద్దతు పలికాడు. ప్రజాస్వామ్యంలో అగ్రగామిగా ఉండాలని సూచించాడు.
తైవాన్, ప్రజాస్వామ్యానికే కాదు మనందరికీ ప్రధానంగా జపాన్ కు భయంకరమైన సవాల్ అని హెచ్చరించారు షింజో అబే. సైనిక వ్యవహారాల్లో సాహసం, చైనా వంటి భారీ ఆర్థిక వ్యవస్థ అనుసరిస్తే అది స్వయంగా ఆత్మహత్యతో సమానమని పేర్కొన్నాడు.
చైనా దూకుడును అడ్డుకున్నాడు. ఆపై చైనాపై యుద్దం ప్రకటించాడు. తైవాన్ లో ఎమర్జెన్సీ విధిస్తే అది జపాన్ లో కూడా విధించినట్లేనని పేర్కొన్నాడు షింజో.
దీంతో జపనీస్ మితవాద రాజకీయ నాయకులు చైనా పట్ల తీవ్ర శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. మొత్తం మీద చివరి వరకు భారత దేశంతో సత్ సంబంధాలను నెరిపాడు.
అందుకే భారత్ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ను ప్రకటించి సత్కరించింది.
Also Read : జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు