Uddhav Thackeray : శివసేన పార్టీ నుంచి షిండే బహిష్కరణ
ప్రకటించిన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఠాక్రే
Uddhav Thackeray : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేన పార్టీ పై తిరుగుబాటు జెండా ఎగుర వేసి ఏకంగా మరాఠా సీఎం పీఠంపై కొలువు తీరిన ఏక్ నాథ్ షిండేకు కోలుకోలేని షాక్ ఇచ్చారు శివసేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray).
శనివారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను ఏక్ నాథ్ షిండేను పార్టీ నుండి బహిస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సీఎం షిండేకు లేఖ రాశారు.
పార్టీ నియమావళికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా, అనైతికను ప్రోత్సహించినందుకు పార్టీ నుంచి వెలి వేస్తున్నట్లు డిక్లేర్ చేశారు.
ఇదిలా ఉండగా మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన పార్టీ పట్ల చిన్న తనంలోనే ఆకర్షితుడయ్యాడు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).
ముంబై లోని థానే జిల్లా సతారా స్వంత స్థలం షిండేది. మొదట్లో బతుకు దెరువు కోసం చిన్న చిన్న పనులు చేశాడు. ఆపై ఆటో రిక్షా కూడా నడిపాడు.
18 ఏళ్లకే శివసేనలో విస్మరించ లేని కార్యకర్తగా ఉన్నాడు. బాలా సాహెబ్ కు అనుంగు శిష్యుడిగా మారాడు. ఆపై మాస్ లీడర్ గా ఎదిగాడు. కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలుపొందాడు.
నాలుగు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికై సంచలన సృష్టించాడు. పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా, హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆపై తనను పక్కన పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండా ఎగుర వేశాడు. గుజరాత్ లోని సూరత్ లో క్యాంప్ ఏర్పాటు చేశాడు.
ఆపై అస్సాంకు మార్చాడు. అక్కడి నుంచే రాజకీయం నడిపాడు. బీజేపీ మద్దతుతో మహారాష్ట్రకు సీఎం అయ్యాడు.
Also Read : ముంబైకి ద్రోహం తలపెడితే ఊరుకోను