Eknath Shinde : శివసేన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కామెంట్స్
Eknath Shinde : మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్ చేశారు. శివసేన పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదని స్పష్టం చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని ముంబైలో భారీ ఎత్తున ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) సారథ్యంలో, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేల నేతృత్వంలో పోటా పోటీగా ర్యాలీలు చేపట్టారు. ఇదిలా ఉండగా షిండే, ఠాక్రేలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
అధికారాన్ని చేజిక్కించు కునేందుకు జత కట్టేందుకు ఏక్ నాథ్ షిండే , అతని మద్దతుదారులు ద్రోహం తలపెట్టారంటూ మండిపడ్డారు. ప్రధానంగా మరాఠా ప్రజలను మోసం చేసిన ఘనత షిండేకు దక్కుతుందన్నారు. మూడు నెలల కిందట షిండే, ఠాక్రే ఒకే కేబినెట్ లో సహచరులు. కానీ ఇవాళ ప్రత్యర్థులుగా మారారు.
అధికారాన్ని చేజిక్కించు కునేందుకు బీజేపీతో షిండే జత కట్టారు. షిండే, బీజేపీ సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశారు. తమను ద్రోహులుగా అభివర్ణించిన ఉద్దవ్ ఠాక్రేపై నిప్పులు చెరిగారు సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde). శివసేన పార్టీ అందరిదని ఉద్దవ్ ఠాక్రేది కాదన్నారు. ఎవరు ఎవరిని మోసం చేశారో మరాఠా ప్రజలకు తెలుసన్నారు.
ఉద్దవ్ ఠాక్రే సెంట్రల్ ముంబై లోని శివాజీ పార్క్ మైదానంలో 43 నిమిషాల పాటు ప్రసంగించారు. 1966 లో తన పార్టీ ఆవిర్భావం నుండి దసరా ర్యాలీలను నిర్వహిస్తూ వస్తోంది. ఏక్ నాథ్ షిండే గంటన్నర పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బాల్ ఠాక్రే వారసత్వానికి నిజమైన వారసులు ఎవరో చెప్పేందుకు తన దసరా ర్యాలీకి భారీగా తరలి రావడం నిదర్శనమన్నారు ఏక్ నాథ్ షిండే.
Also Read : షిండేను ప్రజలు క్షమించరు – ఠాక్రే