Sudhir Suri Shot Dead : శివసేన నేత సుధీర్ సూరి కాల్చివేత
మూసే వాలా తర్వాత చోటు చేసుకున్న ఘటన
Sudhir Suri Shot Dead : పంజాబ్ లోని అమృత్ సర్ లో శివసేన నాయకుడు సుధీర్ సూరిని శుక్రవారం కాల్చి చంపారు(Sudhir Suri Shot Dead). ఈ ఘటన ప్రముఖ ప్రార్థనా మందిరం వెలుపల జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గోపాల్ మందిర్ ఆలయ ప్రాంగణం వెలుపల చెత్త కుప్పలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపించాయి.
శివసేన నాయకులు నిరసన తెలిపారు. ఇంతలో గుంపులో నుంచి ఎవరో వచ్చి సుధీర్ సూరిని కాల్చడంతో కలకలం రేగింది. సూరికి బుల్లెట్ గాయాలు కావడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. అంతలోపే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
సుధీర్ సూరిని కాల్చి చంపడంపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రీతి గాంధీ స్పందించారు. అమృత్ సర్ లో చాలా మంది పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుధీర్ సూరి ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సూరి ఖలీస్తాన్ వాదుల హిట్ లిస్టులో ఉన్నాడని అందుకే చంపారంటూ ఆరోపించారు ప్రీతి గాంధీ.
విచిత్రం ఏమిటంటే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గుజరాత్ ఆప్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని , పాలన గాడి తప్పిందని దీనికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూరిపై ఐదుకు పైగా కాల్పులు జరిగాయి.
స్పృహ తప్పి పోయాడు. ఆస్పత్రికి తరలించగా బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామని , నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాదీనం చేసుకున్నామని చెప్పారు. గ్యాంగ్ స్టర్ హిట్ లిస్టులో సూరి ఉన్నాడని పేర్కొన్నారు.
Also Read : హైకోర్టు భిన్న స్వరం సుప్రీంకోర్టు ఆగ్రహం