Gajanan Kirtikar : ద్రౌపది ముర్ముకు మద్దతు ఇద్దాం – ఎంపీ
వెల్లడించిన ఎంపీ గజనాన్ కీర్తికర్
Gajanan Kirtikar : శివసేన పార్టీ చీఫ్, మరాఠా మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కోలుకోలేని షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీలు. ఆయన సారథ్యంలో సోమవారం ముంబైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
శివసేనకు చెందిన 16 మంది ఎంపీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని కోరారు. ద్రౌపది ముర్ము ఆదివాసీ తెగకు చెందిన గిరిజన మహిళ అని. ఆమె పేద కుటుంబం నుంచి అత్యున్నత గవర్నర్ స్థాయి వరకు చేరుకుందని తెలిపారు.
జూనియర్ అసిస్టెంట్ గా, కౌన్సిలర్ గా, పార్టీ జాతీయ నాయకురాలిగా, రెండు సార్లు మంత్రిగా, జార్ఖండ్ గవర్నర్ గా పని చేశారంటూ ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రేకు విన్నవించారు.
పార్టీలకు అతీతంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు మాజీ సీఎంను. ఈ విషయాన్ని శివసేన పార్టీకి చెందిన ఎంపీ గజనాన్ కీర్తికర్(Gajanan Kirtikar).
ఇక ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఎఫ్ తరపున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఉంటే విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.
ఈ తరుణంలో ప్రస్తుతం తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఏకంగా బీజేపీ మద్దతుతో ఏకంగా సీఎం అయ్యారు. దీంతో శివసేన పార్టీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఉద్దవ్ ఠాక్రే తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఈ ఎంపీల సమావేశానికి సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు ఎంపీ అయిన శ్రీకాంత్ షిండేతో పాటు ఆరుగురు సేన ఎంపీలు దూరంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా శివసేన పార్టీకి 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 16 మంది లోక్ సభ ఎంపీలుగా ఉండగా రాజ్యసభలో ముగ్గురు ఎంపీలుగా కొలువు తీరారు.
Also Read : ‘మరాఠా’పై విచారించనున్న సుప్రీంకోర్టు