Ramdas Athawale : శివసేన పార్టీ ఠాక్రేది కాదు షిండేది
కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే
Ramdas Athawale : కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే(Ramdas Athawale) సంచలన కామెంట్స్ చేశారు. మరాఠాకు సంబంధించి శివసేన పార్టీ ఎవరిదనే ప్రశ్న నడుస్తోందన్నారు.
దీనిపై ఆయన స్పందించారు. బుధవారం రామ్ దాస్ అథవాలే మీడియాతో మాట్లాడారు. శివసేన పార్టీ పూర్తిగా ప్రస్తుత సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండేకే చెందుతుందన్నారు.
ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఎక్కువ మంది సభ్యులు ఎవరైతే సపోర్ట్ చేస్తారే వారే ఆ పార్టీకి చీఫ్ గా ఉంటారని స్పష్టం చేశారు.
దీంతో శివసేన పార్టీకి సంబంధించి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల్లో మూడింట రెండొంతుల మంది షిండే వర్గానికి మద్దతు ఇస్తున్నారని అందుకే తాను ఆ పార్టీ షిండేకే చెందుతున్నట్లు భావిస్తున్నానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) ను తమ నాయకుడిగా కావాలని కోరుతున్నారు.
అందుకే మెజారిటీ అంతా ఇటు వైపు ఉన్నందుకే తాను కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ముంబై లోని శివాజీ పార్క్ లో పార్టీ వార్షిక దసరా ర్యాలీని నిర్వహించే నైతిక హక్కు ఏక్ నాథ్ షిండేకు మాత్రమే ఉందని కానీ మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కు లేదని కుండ బద్దలు కొట్టారు.
కాగా అక్టోబర్ లో దసరా ర్యాలీ నిర్వహించేందుకు గాను శివాజీ పార్క్ ను బుక్ చేసేందుకు శివసేనకు చెందిన ఉద్దవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని వర్గాల నుండి తమకు దరఖాస్తులు అందాయని ముంబై పౌర సంఘం తెలిపింది. దీనినే ఏక్ నాథ్ షిండేకే ప్రస్తావించారు.
Also Read : ఎల్జీ నోటీసుల్ని చించేసిన ఆప్ ఎంపీ