Aditya Thackeray : యువ‌రాజు దారి త‌ప్పాడు – రెబ‌ల్స్

ఆదిత్యా ఠాక్రేపై ఎమ్మెల్యేల ఎద్దేవా

Aditya Thackeray :  మ‌హారాష్ట్ర‌లో మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వం కూలి పోయాక శివ‌సేన రెబ‌ల్ నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలో కొత్త స‌ర్కార్ ఏర్పాటైంది. ప్ర‌స్తుతం శివ‌సేన పార్టీ ఎవ‌రిది అనే దానిపై కోర్టులో కేసు న‌డుస్తోంది.

దీనికి సంబంధించి సుప్రీం ధ‌ర్మాస‌నం తొంద‌ర ప‌డొద్దంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సూచించింది. శివ‌సేన పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, ప్ర‌స్తుత సీఎం ఏక్ నాథ్ షిండే ఇద్ద‌రూ కోర్టును ఆశ్ర‌యించారు.

ఇదే స‌మ‌యంలో పార్టీలో క్యాడ‌ర్ వెళ్ల‌కుండా ఉండేందుకు కూట‌మి కూలి పోయిన వెంట‌నే ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) రంగంలోకి దిగారు. ఆయ‌న రాష్ట్రంలో ప‌ర్య‌టించేందుకు శ్రీ‌కారం చుట్టారు.

ఎవ‌రు నిజ‌మైన శివ సైనికులో తేల్చుకోవాల‌ని పిలుపునిచ్చారు. నిజ‌మైన మరాఠా యోధులు ఎప్పుడూ ఉద్ద‌వ్ ఠాక్రే వెంట ఉంటార‌ని, మోసం చేసిన వారిని ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని హెచ్చ‌రించారు.

ఇదిలా ఉండ‌గా ఉద్ద‌వ్ తో పాటు ఆదిత్యా ఠాక్రేను(Aditya Thackeray) రెబ‌ల్ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌ధానంగా వారంతా ఆదిత్యా ఠాక్రేను టార్గెట్ చేశారు.

ఆయ‌న పేరుతో ఉన్న బ్యాన‌ర్ పై యువ‌రాజు దారి త‌ప్పాడంటూ ఓ కొటేష‌న్ కూడా త‌గిలించారు. ప్ర‌స్తుతం మ‌రాఠా రాజ‌కీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

అయితే తిరుగుబాటు వ‌ర్గాన్ని ఠాక్రే ద్రోహులంటూ మండిప‌డ్డారు. ఆయ‌న హ‌ద్దులు మీరి మాట్లాడుతున్నారంటూ శివ‌సేన అస‌మ్మ‌తివాదులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం శివ‌సేన రెబ‌ల్స్ ప్ర‌ద‌ర్శించిన ఈ బ్యాన‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : క‌ర్ణాట‌క విద్యా శాఖ అవినీతిపై పీఎంకు లేఖ

Leave A Reply

Your Email Id will not be published!