Uddhav Thackeray : శివసేన సైనికులు సత్తా చాటాలి – ఠాక్రే
మహిళా ఆఫీస్ బేరర్లతో శివసేన చీఫ్ సమావేశం
Uddhav Thackeray : శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) మరింత ఉత్సాహంతో ఉన్నారు. ఇంకొకరైతే సీఎం పదవి పోయిందన్న బాధలో ఉండే వారు. కానీ ఉద్దవ్ ఠాక్రే మాత్రం ఊహించని రీతిలో మళ్లీ కార్యక్షేత్రంలోకి దూకారు.
ఓ వైపు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం ప్రకటించారు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు.
చివరకు శివసేన పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగారు ఏక్ నాథ్ షిండే. ఈ తరుణంలో ఉద్దవ్ ఠాక్రే కార్యకర్తలలో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.
మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీని ఎవరు మోసం చేసినా వారిని ప్రజలు క్షమించరన్నారు ఉద్దవ్ ఠాక్రే. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొద్ది కాలమే ఉంటుందని, రాబోయే కలం మనదేనన్నారు.
వ్యక్తిగత దూషణలు, విమర్శలకు దిగ వద్దని సూచించారు. ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. త్వరలోనే మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని జోష్యం చెప్పారు.
మనల్ని చెరపాలని చూస్తే వాళ్లు కూడా ఏదో ఒక రోజు మోస పోవడం ఖాయమన్నారు. శివ సైనికులుగా ప్రస్తుతం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని స్పష్టం చేశారు.
మంగళవారం ముంబైలో జరిగిన శివసేన మహిళా విభాగం ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్షులతో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ పాల్గొన్నారు.
Also Read : ముంబైని ముంచెత్తిన వర్షం