Sanjay Shirsat : అజిత్ పవార్ చేరితే బీజేపీతో కటీఫ్
శివసేన నేత సంజయ్ శిర్సత్ వార్నింగ్
Sanjay Shirsat : ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీ నేతలతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరితే మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వం లోని శివసేన ప్రభుత్వంలో భాగం కాదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ హెచ్చరించారు.
ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీతో వెళ్లదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మా విధానం ఏమిటో ముందుగానే చెప్పాం. ఎన్సీపీకి ముందు నుంచి ద్రోహం చేస్తూ వస్తోంది. అది మహా వికాస్ అఘాడీలో చిచ్చు పెట్టింది. ఇవాళ షిండే, మహారాష్ట్ర సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ శిర్సత్(Sanjay Shirsat) .
బీజేపీ ఎన్సీపీని తమతో తీసుకెళితే మహారాష్ట్ర ఇష్ట పడదన్నారు. ప్రజలు ఇందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరన్నారు. అజిత్ పవార్ ఏమీ అనలేదని అంటే ఎన్సీపీలో ఉండ కూడదన్నారు శివసేన పార్టీ అధికార ప్రతినిధి.
మేము కాంగ్రెస్, ఎన్సీపీ అఘాడీ ప్రభుత్వంలో భాగమైన వారితో ఉండేందుకు ఇష్ట పడలేదు. కాబట్టే విడిచి పెట్టామన్నారు. అజిత్ పవార్ కు అక్కడ స్వేచ్ఛ లేదు. అతను గనుక ఎన్సీపీని విడిచి పెట్టాలని అనుకుంటే తాము ఆయనను స్వాగతమిస్తామన్నారు.
ఒకవేళ ఎన్సీపీ నేతలతో కలిసి వస్తే మాత్రం తాము సర్కార్ లో ఉండబోమంటూ స్పష్టం చేశారు. అజిత్ పవార్ అసంతృప్తికి కారణం ఆయన తనయుడు పార్థ్ పవార్ అంతకు ముందు ఎన్నికల్లో ఓడి పోవడమేనని పేర్కొన్నారు.
Also Read : వందే భారత్ రైలు భేష్ – శశి థరూర్