Shiva Ayyadurai : ట్విట్ట‌ర్ సిఇఓ రేసులో శివ అయ్య‌దురై..?

ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఎంఐటీ స్కాల‌ర్

Shiva Ayyadurai : టెస్లా సిఇఓ, చైర్మ‌న్ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ ఇటీవ‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న భారీ ధ‌ర‌కు దానిని టేకోవ‌ర్ చేసుకున్నాడు. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ప‌రుగులు పెట్టిస్తున్నారు. 9 వేల మందికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించాడు. ఇదంతా సంస్థ బాగు కోస‌మే చేస్తున్నానంటూ స్ప‌ష్టం చేశాడు.

ఈ త‌రుణంలో తాను సిఇఓగా ఉండాలా లేదా అనే అంశంపై ఏకంగా ట్విట్ట‌ర్ లో పోల్ నిర్వ‌హించాడు ఎలోన్ మ‌స్క్. 56 శాతం మంది ఉండ కూడ‌ద‌ని 44 శాతం మ‌స్క్ నే సిఇఓగా ఉండాల‌ని కోరారు. అభిప్రాయ స‌ర్వేలో త‌న‌కు వ్య‌తిరేకంగా రావ‌డంతో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు.

త‌న‌కంటే బుద్ది త‌క్కువ క‌లిగిన వ్య‌క్తులు ఎవ‌రైనా స‌రే సిఇఓగా రావ‌చ్చంటూ తెలిపాడు ఎలోన్ మ‌స్క్. తాజాగా ట్విట్ట‌ర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ రేసులో ప్ర‌వాస భార‌తీయుడైన శివ అయ్య‌దురై(Shiva Ayyadurai) ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఆయ‌న త‌న స్వంత ట్విట్ట‌ర్ వేదిక‌గా ఇదే విష‌యాన్ని పేర్కొన్నారు.

దానిని పోస్ట్ కూడా చేశారు. ఆ ట్వీట్ నిమిషాల్లో వైర‌ల్ గా మారింది. తాను త‌దుప‌రి సిఇఓగా కావాల‌ని ఉంద‌ని తెలిపాడు. ఆ స‌త్తా త‌న‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశాడు. ఆయ‌న ఎంఐటీ స్కాల‌ర్ గా ఉన్నాడు. స్వ‌స్థ‌లం భార‌త దేశంలోని త‌మిళ‌నాడు శివ అయ్య‌దురైది.

ప్ర‌పంచంలోనే టాప్ ఐటీగా పేరొందింది మ‌సాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎంఐటీ)కి చెందిన భార‌తీయ పండితుడిగా పేరొందారు శివ అయ్య‌దురై. ఎంఐటీ నుండి నాలుగు డిగ్రీలు ఉన్నాయి. అంతే కాదు ఏడు విజ‌య‌వంత‌మైన హైటెక్ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటు చేశానని తెలిపాడు.

ద‌య‌చేసి స‌ల‌హా ఇవ్వండి లేదంటే న‌న్ను నిమ‌మించ‌మ‌ని కోరారు.

Also Read : వీడియోకాన్ గ్రూప్ చైర్మ‌న్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!