Shivraj Singh Chauhan : రాహుల్ కామెంట్స్ చౌహాన్ సీరియస్
పరిణతి లేకుండా మాట్లాడితే ఎలా
Shivraj Singh Chauhan Rahul : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లండన్ వేదికగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీకి చెందిన అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ , ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ నిప్పులు చెరిగారు. వీరి సరసన మరో సీఎం కూడా చేరి పోయారు.
రాహుల్ గాంధీ అవగాహన లేకుండా చిన్న పిల్లాడి కంటే దారుణంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి కామెంట్స్ చేయడం రాహుల్ గాంధీకి( Rahul Gandhi) అలవాటుగా మారిందని మండిపడ్డారు సీఎం. కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి పాలవుతోందని, దీనిని జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతు లభిస్తోందని, యావత్ ప్రపంచం ఆయన నాయకత్వ ప్రతిభను చూసి మెచ్చుకుంటున్నారని స్పష్టం చేశారు. కానీ రాహుల్ గాంధీ దానిని తట్టుకోలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎంపీ మాటల్ని దేశ ప్రజలు నమ్మరని , కానీ విదేశాల్లో నమ్ముతారని అక్కడికి వెళ్లి ఇలా విమర్శలకు దిగుతున్నారంటూ నిప్పులు చెరిగారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan Rahul) . ఆయనకు దేశం పట్ల గౌరవం లేదని, అంతకన్నా ప్రేమ కూడా లేదని సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ తగ్గిందని, రాబోయే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతుందని సీఎం జోష్యం చెప్పారు.
Also Read : ప్రతిపక్షాల లేఖకు బీజేపీ కౌంటర్