Chicago Parade Shoot : చికాగో పరేడ్ కాల్పుల్లో షూటర్ అరెస్ట్
పరేడ్ ఘటనలో ఆరుగురు మృతి
Chicago Parade Shoot : అమెరికాలోని చికాగో సమీపంలో ఈనెల 4న చోటు చేసుకున్న పరేడ్ కాల్పుల్లో(Chicago Parade Shoot) 6 మంది చని పోయారు. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వేడుకలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఒక సాయుధుడు రిటైల్ దుకాణం పై నుండి కవాతు లోకి కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పులు జరగడంతో పరేడ్ లో పాల్గొన్న వారు ఒక్కసారిగా భయంతో పారి పోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియలో బయట పడింది.
చికాగో శివారులో అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. అక్కడికక్కడే ఆరుగురు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో కనీసం 24 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని గుర్తించారు. 22 ఏళ్లున్న రాబర్ట్ క్రిమో ని అరెస్ట్ చేశారు.
కారు ఛేజ్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు హైలాండ్ పార్క్ పోలీస్ చీఫ్ లౌ జోగ్ మెన్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవాతును చూస్తున్న వారు కాల్పుల మోతతో ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు.
ఈ సమయంలో 24 మందిని హైలాండ్ పార్క్ ఆస్పత్రికి తరలించామన్నారు. ఆరుగురు చనిపోయినట్లు ధ్రువీకరించారు పోలీస్ కమాండర్ క్రిస్ ఓనీల్ తెలిపారు.
కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ఉత్సవాలను రద్దు చేసినట్లు హైలాండ్ పార్క్ నగరం ప్రకటించింది. ఈ ఘటనపై అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన సన్నివేశంగా పేర్కొన్నారు.
Also Read : దేశాన్ని ఏకం చేసే అంశాలపై దృష్టి పెట్టాలి