Siddaramaiah : పోస్ట‌ర్ల చించివేత‌పై సిద్ద‌రామ‌య్య ఫైర్

తాము రంగంలోకి దిగితే త‌ట్టుకోలేరు

Siddaramaiah : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు పాద‌యాత్ర‌ను చేప‌ట్టారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో కొన‌సాగుతోంది.

అక్క‌డి నుంచి క‌ర్ణాట‌క‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున న‌గ‌రంలో రాహుల్ గాంధీ పోస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. పోస్ట‌ర్ల‌ను చించి వేయ‌డంపై మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య(Siddaramaiah) సీరియ‌స్ అయ్యారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పోస్ట‌ర్ల‌ను చించి వేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

శుక్ర‌వారం సిద్ద‌రామ‌య్య మీడియాతో మాట్లాడారు. బీజేపీ శ్రేణులు కావాల‌ని త‌మ పార్టీకి చెందిన నేత పోస్ట‌ర్లు, ఫ్లెక్సీల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని వారు ఇలాగే చేస్తే కాషాయ నేత‌లు ఎవ‌రూ క‌ర్ణాట‌క‌లో స్వేచ్ఛ‌గా తిర‌గ‌లేర‌ని సిద్ద‌రామ‌య్య సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని, ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

పోలీసులు బీజేపీ స‌ర్కార్ ను చూసి మిడిసి ప‌డుతున్నార‌ని జ‌ర జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు సిద్ద‌రామ‌య్య‌. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన భార‌త యాత్రకు(Bharat Jodo Yatra) క‌న్న‌డ నాట ఘ‌న స్వాగతం ల‌భించింది.

మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌తో పాటు క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివ‌కుమార్ స‌హా ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాద‌యాత్ర బృందానికి స్వాగ‌తం ప‌లికారు. ఇలాంటి చ‌ర్య‌లు ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు సిద్ద‌రామ‌య్య‌. బీజేపీ రాచ‌రిక పాల‌న సాగిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : సీఎం ప‌ద‌వి కంటే పార్టీ ముఖ్యం – గెహ్లాట్

Leave A Reply

Your Email Id will not be published!