Siddaramaiah : సీఎం రేసులో సిద్ద‌రామ‌య్య ముందంజ‌

వెనుక‌బ‌డిన క‌ర్నాట‌క పీసీసీ చీఫ్ శివ‌కుమార్

Siddaramaiah : క‌ర్ణాట‌క సీఎం రేసులో పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ ను కాద‌ని మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య ముందంజ‌లో నిలిచారు. ఏఐసీసీ పూర్తిగా డీకేను కాద‌ని సిద్ద‌రామ‌య్య వైపు మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం. కేసుల బూచి చూపి డీకేను కాకుండా సిద్దరామ‌య్యకే అవ‌కాశం ఇచ్చిన‌ట్లు టాక్. ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి అత్యంత ఇష్ట‌మైన నాయ‌కుడు సిద్ద‌రామ‌య్య‌. ఆయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క్లీన్ ఇమేజ్ క‌లి ఉన్నారు. ఇది బిగ్ అడ్వాంటేజ్ గా మారింది.

గ‌త నాలుగు రోజులుగా ఉత్కంఠ నెల‌కొంది. ఎవ‌రు సీఎంగా ఎంపిక చేస్తార‌నే దానిపై. ఇద్ద‌రూ తాము సీఎం రేసులో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పోటీ తీవ్ర‌మైంది. పార్టీ ప‌రిశీల‌కులు సీఎల్పీ మీటింగ్ చేప‌ట్టారు. ఆపై నివేదిక‌ను హైక‌మాండ్ కు అంద‌జేశారు. చివ‌ర‌కు బంతి దేశ రాజ‌ధాని హ‌స్తిన‌కు చేరింది. సిద్ద‌రామ‌య్య‌తో పాటు డీకే శివ‌కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ను ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. సీఎం ఎంపికపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.

కానీ చివ‌ర‌కు క్లీన్ ఇమేజ్ క‌లిగి ఉన్న సిద్ద‌రామ‌య్య ను ఎంపిక చేయాల‌ని రాహుల్ గాంధీ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా డీకే శివ‌కుమార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తాను పార్టీని వీడ‌న‌ని, బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Supreme Court

 

Leave A Reply

Your Email Id will not be published!