Siddarth Luthra : బాబు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన లాయ‌ర్

న‌మ్ముకుంటే న‌ట్టేట మునిగేలా చేసింది

Siddarth Luthra : విజ‌య‌వాడ – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఏపీ రాష్ట్ర చ‌రిత్ర‌లో సుదీర్ఘ స‌మ‌యం ఏసీబీ కోర్టులో వాద‌న‌లు కొన‌సాగ‌డం విస్తు పోయేలా చేసింది. ఆరున్న‌ర గంట‌ల‌కు పైగా వాద‌న‌లు కొన‌సాగాయి.

Siddarth Luthra Senior Advocate

ఏపీ సీఐడీ బ‌ల‌మైన ఆధారాల‌ను స‌బ్మిట్ చేసింది. 25 పేజీల‌తో కూడిన రిమాండ్ రిపోర్టును ప‌రిశీలించింది కోర్టు న్యాయ‌మూర్తి హిమ బిందు. సీఐడీ త‌ర‌పున ఆంధ్ర ప్ర‌దేశ్ అడిష‌న‌ల్ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ సుధాక‌ర్ రెడ్డి వాదించారు.

ఇక తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌ర‌పున ఇద్ద‌రు లాయ‌ర్లు వాదించారు. ఒక‌రు దేశంలోనే పేరు పొందిన సుప్రీంకోర్టు లాయ‌ర్ సిద్దార్థ్ లూథ్రా(Siddarth Luthra), ఏపీకి చెందిన వెంక‌టేశ్వ‌ర్ రావు.

ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని, మాజీ సీఎంను అరెస్ట్ చేసే ముందు గ‌వ‌ర్న‌ర్ కు తెలియ చేయాల‌ని కానీ దానిని పాటించ లేద‌ని, 409 సెక్ష‌న్ చంద్ర‌బాబుకు వ‌ర్తించ‌ద‌ని వాదించారు సిద్దార్థ్ లూథ్రా. రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు పెద్ద ఎత్తున ఉత్కంఠ నెల‌కొంది. చివ‌రి నిమిషం వ‌ర‌కు బెయిల్ వ‌స్తుంద‌ని భావించారు టీడీపీ శ్రేణులు.

కానీ సీన్ మారింది. ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి లూథ్రాను పిలిపించినా ఫలితం లేక పోయింది. 14 రోజుల రిమాండ్ కు త‌ర‌లించాల‌ని జ‌డ్జి హిమ బిందు తీర్పు చెప్పారు.

Also Read : Pawan Kalyan : ఏపీలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ – ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!