Siddarth Luthra : చంద్రబాబు ప్రాణానికి ముప్పు – లూథ్రా
లాయర్ సిద్దార్థ్ సంచలన కామెంట్స్
Siddarth Luthra : విజయవాడ – టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన తరపు వాదిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ్ లూథ్రా. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన చంద్రబాబు నాయుడును జైలుకు ఎలా తరలిస్తారంటూ ప్రశ్నించారు.
Siddarth Luthra Shocking Comments
గృహ నిర్బంధంలో ఉంచాలని కోరుతూ తాము ఇవాళ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు లూథ్రా(Siddarth Luthra). ఆయన వయసు దృష్ట్యా ఆలోచించాలని కోరారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు కోర్టులలో వెలువరించిన తీర్పులను ఈ సందర్బంగా ఉదహరించారు.
వెంటనే చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఆయన నిన్న ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. కేవలం 409 సెక్షన్ పైనే ఉదహరించారు. కానీ జడ్జి ఒప్పుకోలేదు. ఏపీ సీఐడీ 25 పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించింది. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి హిమ బిందు సంచలన తీర్పు వెలువరించారు.
14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు సిద్దార్థ్ లూథ్రా.
Also Read : Chandrababu Khaidi No 7691 : చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691
