Siddique Kappan : సుప్రీం బెయిల్ ఇచ్చినా జైలులోనే క‌ప్ప‌న్

కేర‌ళ జ‌ర్న‌లిస్ట్ సిద్దిక్ పై ఈడీ విచార‌ణ

Siddique Kappan : ఈ దేశంలో విచిత్ర‌క‌ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. చాలా మంది జ‌ర్న‌లిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ర‌క‌మైన వివ‌క్ష‌, దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి.

స‌త్యాన్ని, వాస్త‌వాల‌ను వెలికి తీసే పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వృత్తి ప‌రంగా. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది యూపీలోని ద‌ళిత బాలిక సామూహిక రేప్ కేసు.

దీనికి సంబంధించి ప్ర‌త్యేక క‌థ‌నం కోసం కేర‌ళ నుంచి యూపీకి వ‌చ్చాడు సిద్దిక్ క‌ప్ప‌న్(Siddique Kappan). ఆయ‌న‌ను ఉపా కింద కేసు న‌మోదు చేశారు. జైల్లో పెట్టారు. దేశ వ్య‌తిరేక కార్యకాల‌పాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఆధారాలు లేకుండా మ‌నిషి ఎలా ప్ర‌మాద‌క‌రంగా దేశానికి త‌యార‌య్యాడో చెప్పాల‌ని ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. దీనికి ఎలాంటి స‌మాధానం చెప్ప‌లేక పోయారు.

దీంతో సిద్దిక్ క‌ప్ప‌న్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు క‌ప్ప‌న్ కు మంజూరు కాలేదు బెయిల్. ఆయ‌న ఇంకా జైలులోనే ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదిలా ఉండగా సెప్టెంబ‌ర్ 9న బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు జిల్లా , సెష‌న్స్ జ‌డ్జి అనురోద్ మిశ్రా క‌ప్ప‌న్(Siddique Kappan) ను విడుద‌ల చేశారు.

కాగా క‌ప్ప‌న్ పై ఈడీ కేసు ఇంకా పెండింగ్ లో ఉన్నందున లక్నో లోని జైలులోనే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు పోలీసులు.

Also Read : గూండాల స‌మూహం స్వేచ్ఛ‌ను అడ్డుకోలేదు

Leave A Reply

Your Email Id will not be published!