Sidharamaiah : కర్ణాటక సర్కార్ పై సిద్దరామయ్య కన్నెర్ర
బాధ్యత లేని మంత్రుల నిర్వాకంపై ఫైర్
Sidharamaiah : కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందా లేదోనన్న అనుమానం కలుగుతోందన్నారు మాజీ సీఎం సిద్దరామయ్య(Sidharamaiah). బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు.
మొన్నటికి మొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి వి సోమన్న తనకు న్యాయం చేయమని కోరేందుకు వచ్చిన మహిళను చెంప చెళ్లుమనిపించారని ఆ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యిందన్నారు. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అతి పెద్ద స్కాం . ఎస్ రిక్రూట్ మెంట్ పరీక్ష.
దీనికి సంబంధించి న్యాయం కోసం వచ్చిన బాధితులపై డిప్యూటీ ఎస్పీ దాడికి దిగడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. అసలు సీఎం బొమ్మై నిద్ర పోతున్నారా లేక ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు సిద్దరామయ్య(Sidharamaiah). పాలన చేతకాని వ్యక్తిని తీసుకు వచ్చి సీఎం పదవిలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు మాజీ సీఎం.
ఈ రోజు వరకు ఏ ఒక్కరు సంజాయిషీ ఇవ్వడం కానీ లేదా క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. ఎందుకని ప్రశ్నించారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో పవర్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మానవత్వం అన్నది లేకుండా పోయిందన్నారు. కమీషన్ , కరప్షన్ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కేరాఫ్ గా మారందని సంచలన ఆరోపణలు చేశారు సిద్దరామయ్య.
ఓ వైపు నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతుంటే జవాబు చెప్పాల్సిన బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు సిద్దరామయ్య.
తుమకూరులో హోంమంత్రిని కలిసేందుకు వెళ్లిన బాధితులపై దాడికి పాల్పడటం దారుణమన్నారు మాజీ సీఎం.
Also Read : ఎంఐఎం బీజేపీకి అనుకూలం – జైరాం రమేష్