Sidhu : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నలలోనే పంజాబ్ పాలన సాగుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇందుకు ఉదాహరణంగా వారు మరోసారి భగవంత్ మాన్ ను ఎత్తి చూపారు.
కేజ్రీవాల్ సారథ్యంలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారని, ఈ మీటింగ్ కు భగవంత్ మాన్ గైర్హాజరయ్యారంటూ ఎద్దేవా చేశాయి కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీల నేతలతో సహా మాజీ సీఎం అమరీందర్ సింగ్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఆప్ కొలువు తీరిన తర్వాత జరిగిన మీటింగ్ ను అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించడం ఏంటి అంటూ నిలదీశారు. దీంతో ప్రతిపక్ష నేతలు చేసిన కామెంట్స్(Sidhu) తీవ్ర దుమారం రేపాయి.
ఢిల్లీ సీఎం పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారంటూ ఆరోపించారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి కూడా ఉన్నారని తెలిపారు.
సీఎం గైర్హాజరయ్యారు. ఉన్నతాధికారులతో కేజ్రీవాల్ ఎలా మీటింగ్ నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఢిల్లీ రిమోట్ కంట్రోల్ ను తెలియ చేస్తోందన్నారు.
ఫెడరిలిజానికి అవమానమని, పంజాబ్ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు పీసీసీ మాజీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ(Sidhu). కేజ్రీవాల్ చేతిలోకి పంజాబ్ వెళ్లి పోయిందన్నారు అమరీందర్ సింగ్ .
భగవంత్ మాన్ కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమేనని తేలి పోయిందన్నారు. దీనిపై ఆప్ ప్రతినిధి మల్విందర్ సింగ్ స్పందించారు. ఆప్ కన్వీనర్ సలహాలు తీసుకోవడం తప్పు ఎలా అవుతుందన్నారు.
Also Read : పరిశ్రమల ఏర్పాటుకు పచ్చ జెండా