Smriti Irani Silly Souls : స్మృతీ ఇరానీ ఫ్యామిలీదే ‘సిల్లీ సోల్స్’

ఆర్టీఐ నివేదికలో సంచ‌ల‌న నిజాలు

Smriti Irani Silly Souls : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఇప్ప‌టికే గోవాలో రెస్టారెంట్ అండ్ బార్ న‌డుపుతున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆధారాలతో స‌హా బ‌య‌ట పెట్టింది.

అయితే కేంద్ర మంత్రి నిప్పులు చెరిగారు. మీడియా సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను టార్గెట్ చేశారు. ఆపై ప‌రువు న‌ష్టం కేసు వేశారు. కానీ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద వివ‌రాలు కోరితే దిమ్మ తిరిగేలా స‌మాధానం వ‌చ్చింది.

ప్ర‌స్తుతం స్మృతీ ఇరానీ మ‌రోసారి ఏం మాట్లాడ‌తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. నిత్యం నీతులు, ధ‌ర్మోప‌దేశాల గురించి మాట్లాడే ఈ నాయ‌కురాలు చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలేనంటోంది కాంగ్రెస్ పార్టీ.

వాస్త‌వానికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భ‌ర్త‌, పిల్ల‌ల‌కు చెందిన కంపెనీకే గోవా లోని వివాదాస్ప‌ద సిల్లీ సోల్స్(Smriti Irani Silly Souls)  రెస్టారెంట్ అండ్ బార్ కు లైసెన్స్ ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టంగా పేర్కొంది.

ఇది ఆర్టీఐ వెల్ల‌డించిన స‌మాచారం ద్వారా రూఢీ అయ్యింది. ఓ ఇంట్లో ఈ బార్ ను న‌డిపిస్తుండ‌డం విశేషం. దీని విష‌యంలో త‌న‌కు , త‌న ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదంటూ గొప్ప‌లు పోయింది కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.

ఈ మొత్తం వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో గోవాకు చెందిన న్యాయ‌వాది ఎయిర్స్ రోడ్రిగ్స్ స‌మాచార హ‌క్కు చ‌ట్టం (ఆర్టీఐ) ద్వారా ద‌ర‌ఖాస్తు చేశారు.

ఇందులో సిల్లీ సోల్స్ ఆహార లైసెన్స్ ను ఎయిటాల్ ఫుడ్ బేవ‌రేజెస్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇచ్చిన‌ట్లు గోవా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ కంపెనీ స్మృతీ ఇరానీ భ‌ర్త‌, కుటుంబీకుల పేరు మీద ఉంద‌ని తేలింది.

ఇందులో 75 శాతం వాటా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రి కేంద్ర మంత్రి నోరు విప్పుతారా లేక మౌనంగా ఉంటారా అన్న‌ది తేలాల్సి ఉంది.

Also Read : నాలుగు రెట్ల మ‌ద్ద‌తు ల‌భిస్తోంది – ఆజాద్

Leave A Reply

Your Email Id will not be published!