Sitaram Yechury Rahul Yatra : యాత్రకు ఆహ్వానం అందలేదు
సీపీఎం నేత కీలక వ్యాఖ్యలు కలకలం
Sitaram Yechury Rahul Yatra : సీపీఎం అగ్ర నేత సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కోరుతూ తమకు ఇంత వరకు ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బుధవారం కాంగ్రెస్ అగ్ర నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ యూపీలో జరిగే రాహుల్ యాత్రకు అన్ని పార్టీలను ఆహ్వానించడం జరిగిందన్నారు.
ఇందులో సీతారాం ఏచూరి పేరు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు ఏచూరి. తమకు ఆహ్వానం లేకుండా ఎలా వెళతామని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను కూడా రావాలని కోరుతామని పేర్కొన్నారు సల్మాన్ ఖుర్షీద్. భారత్ జోడో యాత్రలో చేరాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు ఏచూరి(Sitaram Yechury).
వస్తే పాల్గొనాలా లేదా అన్నది ఆలోచిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 9 రాష్ట్రాలలో పూర్తి యాత్రను పూర్తి చేశారు రాహుల్ గాంధీ . జనవరి 3 నుంచి తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. శీతాకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాహుల్ యాత్ర చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఆయన ఇప్పటి వరకు 2,800 కిలోమీటర్లకు పైగా యాత్రను పూర్తి చేశారు. ఇంకా 800 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాల్సి ఉంది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వేదికగా జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. ఆయన ప్రధానమంత్రి మోదీని, ఆయన పరివారాన్ని, బీజేపీని, కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. దేశాన్ని మోదీ కాదు పాలిస్తున్నది అంబానీ, అదానీలు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : హీరా బెన్ త్వరగా కోలుకోవాలి