Sitaram Yechury : ఈసీ ప్రతిపాదనలపై ఏచూరి ఫైర్
ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన సీపీఎం
Sitaram Yechury : సీపీఎం అగ్ర నేత సీతారాం ఏచూరి (Sitaram Yechury) కీలక వ్యాఖ్యలు చేశారు. మోడల్ ప్రవర్తనా నియమావళిని సవరించే ప్రతిపాదనలను ఉపసంహరించు కోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ అంశంపై పోల్ ప్యానెల్ తన వైఖరిని మార్చు కోవడం తనను విస్మయానికి గురి చేస్తోందని పేర్కొన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోల్లోని వాగ్ధానాలపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించి సవరణలను చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని పార్టీలకు లేఖలు కూడా రాసింది. ఇందు కోసం డెడ్ లైన్ కూడా విధించింది. కేవలం ఆచరణకు నోచుకునే హామీలను మాత్రమే ఇవ్వాలని సూచించింది.
దీని వల్ల కొంత మేరకైనా ఓటర్లను ప్రభావితం చేసే ప్రక్రియకు అడ్డుకట్ట వేసినట్లు భావిస్తోంది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎంసీసీకి ప్రతిపాదించిన సవరణను వెంటనే నిలిపి వేయాలని కోరుతూ సీతారాం ఏచూరీ సీఈసీకి లేఖ రాశారు. సీఈసీ రాజీవ్ కుమార్ కు రాసిన లేఖలో ఎంసీసీలో ప్రతిపాదిత మార్పులు అన్ కాల్డ్ అని పేర్కొన్నారు.
రాజ్యాంగం లోని ఆర్టికల్ 324 ఎన్నికల పర్యవేక్షణ, దిశా నిర్దేశం , నియంత్రణలో ఈసీని ఆదేశించిందని తెలిపారు. ఎన్నికల వాగ్ధానాల వివరాలు, వాటి ఆర్థిక పరమైన చిక్కుల వివరాలను బహిర్గతం చేసే ప్రొఫార్మాలో కమిషన్ తన పరిధిలోకి రాని రాజకీయ , విధాన పరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచి పద్దతి కాదని సూచించారు.
ప్రస్తుతం సీతారం ఏచూరి లేవదీసిన అభ్యంతరాలు చర్చకు దారితీశాయి పార్టీలలో.
Also Read : హిమాచల్’ లో నవంబర్ 13న ఎన్నికలు