SKM : అజయ్ మిశ్రాను తొలగించాల్సిందే – ఎస్కేఎం
కేంద్రానికి రైతుల ఆల్టిమేటం
SKM : ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను రైతులు పరామర్శించారు(SKM). సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు హాజరయ్యారు. అంతకు ముందు రైతుల ఆధ్వర్యంలో మహా పంచాయత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు పరిహారం ఇవ్వడంలో కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించారు. ఇదే సమయంలో రైతుల చావుకు పరోక్షంగా కారకుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు(SKM). ఈ మహా పంచాయత్ కార్యక్రమానికి పంజాబ్, హర్యానా, మధ్య ప్రదేశ్ , ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు.
రైతు అగ్ర నేత రాకేశ్ తికాయత్ కూడా పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చక పోవడంపై కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. చనిపోయిన వారికి యూపీ ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం ఇవ్వక పోవడంపై నిలదీశారు.
తమ డిమాండ్లు నెరవేర్చక పోతే ఈనెల 10న లఖింపూర్ ఖేరిలో మహా పంచాయత్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రిని తొలగించి, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
లఖింపూర్ ఖేరి ఘటనలో సాక్షులుగా ఉన్న వారిపై దాడులకు దిగడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ దేశంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నాయంటూ మండిపడ్డారు(SKM).
ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఈరోజు వరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని దీని వెనుక ఎవరు ఉన్నారనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందన్నారు రాకేశ్ తికాయత్.
Also Read : Rahul Gandhi : పరిహారం ఇవ్వండి ప్రాయచిత్తం చేసుకోండి