Smita Sabharwal : తళుక్కుమన్న స్మితా సబర్వాల్
ఎట్టకేలకు సచివాలయంలో హల్ చల్
Smita Sabharwal : హైదరాబాద్ – గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవిలో కొలువు తీరి చక్రం తిప్పిన , కీలక ఉన్నతాధికారిగా పేరు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఎట్టకేలకు మౌనం వీడింది. రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Smita Sabharwal Got Shocked
ఈ సందర్బంగా ఐఏఎస్ ఆఫీసర్లు మర్యాద పూర్వకంగా సీఎంను కలిశారు. కానీ మాజీ సీఎం కేసీఆర్, మాజీ కేటీఆర్ హయాంలో అన్నీ తామై వ్యవహరించిన ఉన్నతాధికారులు కొందరు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నారు. వీరి పేర్లతో సహా సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయ్యారు.
కానీ ప్రత్యేకంగా తీవ్రమైన విమర్శలు, కామెంట్ల బారిన పడ్డారు సీఎంవో కార్యదర్శి , నీటి పారుదల శాఖ ఇంఛార్జ్ కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలుసుకోక పోవడం కలకలం రేపింది.
కానీ ఉన్నట్టుండి సచివాలయంలో తళుక్కుమంది స్మితా సబర్వాల్. నూతన గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాసరి సీతక్క . ఈ సందర్బంగా ఆమెను కలుసుకుని స్మితా సబర్వాల్ కలుసుకున్నారు. ఆమెతో సంతకం చేయించారు. మొత్తంగా మౌనం వీడిన స్మితను ప్రశంసించారు.
Also Read : Raghuram Rajan : దివాలా తీసేలా ఉచితాలు ఉండొద్దు