Smitha Sabharwal : స్మితా స‌భ‌ర్వాల్ కు కీల‌క బాధ్య‌త‌లు

నీటి పారుద‌ల శాఖ అప్ప‌గింత‌

Smitha Sabharwal : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్, సీఎం కేసీఆర్ ఓఎస్డీగా ప‌ని చేస్తున్న స్మితా స‌భ‌ర్వాల్ కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న రంజ‌త్ కుమార్ ఈనెల 30వ తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

Smitha Sabharwal Prior Responsibilities

ఈ నేప‌థ్యంలో ఆ శాఖ కార్య‌ద‌ర్శిగా సీఎం కార్య‌ద‌ర్శిగా ఉన్న స్మిత‌కు పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. దీంతో పున‌రావాసం, భూ సేక‌ర‌ణ విభాగ డైరెక్ట‌ర్ బాధ్య‌త‌లు కూడా ఆమెకు అప్ప‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మిష‌న్ కాక‌తీయను కూడా ప‌ర్య‌వేక్షించారు స్మితా స‌భ‌ర్వాల్(Smitha Sabharwal). యంగ్ అండ్ డైన‌మిక్ ఐఏఎస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఆఫీస‌ర్ వెళ్లిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అలాంటి దానిని బ్రేక్ చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ గా గుర్తింపు పొందారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ మార్కెటింగ్ శాఖ‌లో కూడా ప‌ని చేశారు. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌న‌కు త‌నే సాటి అని నిరూపించారు.

ఎన్నిక‌ల వేళ కోడ్ అమ‌లులో ఉంటుంది. ఈ స‌మ‌యంలో రాష్ట్ర స‌ర్కార్ స్మితా స‌భ‌ర్వాల్ ను నియ‌మించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది.

Also Read : BRS Party Win : తెలంగాణ‌లో గులాబీదే హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!