Smriti Irani Droupadi Murmu : రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన స్మృతీ ఇరానీ

కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్ త‌ర్వాత

Smriti Irani Droupadi Murmu : భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై రాష్ట్ర‌ప్ర‌త్ని అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ కేంద్ర మంత్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రిపై.

ఇప్ప‌టికే ఉభ‌య స‌భ‌లు లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ ద‌ద్ద‌రిల్లుతోంది. ఈ త‌రుణంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిశారు.

త‌న రెండు శాఖ‌ల రాష్ట్ర మంత్రుల‌తో క‌లిసి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ను సంద‌ర్శించారు. స్మృతీ ఇరానీతో(Smriti Irani) పాటు స్త్రీ, శిశు అభివృద్ది శాఖ మంత్రి మ‌హేంద్ర మంజ్ పారా, మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జాన్ బ‌ర్లా కూడా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసిన వారిలో ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా స్మృతీ ఇరానీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది(Droupadi Murmu) ముర్మును జీ అని పిలుపించుకునే అవ‌కాశం క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా పార్ల‌మెంట్ ద‌ద్ద‌రిల్లుతోంది.

జూలై 28న పూర్తిగా స్తంభించి పోయింది. మ‌రో వైపు జూలై 29న కూడా ఎంపీ అధీర్ రంజ‌న్ చౌద‌రి చేసిన కామెంట్స్ పై ర‌గ‌డ కొన‌సాగుతోంది.

బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ తన‌తో పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) కూడా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్ , స్మృతీ ఇరానీ.

మ‌రో వైపు బీజేపీ మ‌హిళా ఎంపీలు సైతం పార్ల‌మెంట్ భ‌వ‌నం వెలుప‌ల పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో మ‌హిళా క‌మిష‌న్ ఎంపీకి నోటీసులు జారీ చేసింది.

Also Read : భార‌త దేశానికి అధీర్ క్ష‌మాప‌ణ చెప్పాలి

Leave A Reply

Your Email Id will not be published!