Smriti Irani : కాంగ్రెస్ నేత‌ల‌కు లీగ‌ల్ నోటీసులు – స్మృతీ ఇరానీ

కూతురు బార్ న‌డుపుతోంద‌న్న ఆరోప‌ణ‌లపై

Smriti Irani : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగింది. త‌న ప్ర‌తిష్ట‌కు, ప‌రువుకు భంగం క‌లిగించేలా ఆ పార్టీకి చెందిన నాయ‌కులు గ‌త కొన్ని రోజుల నుంచి డ్యామేజ్ చేస్తూ వ‌స్తున్నారంటూ ఆరోపించారు.

త‌న కూతురు పేరును బ‌జారు కీడ్చార‌ని, ఆమె భ‌విష్య‌త్తుతో ఆడుకున్నారంటూ, ఆమెపై బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు.

శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ త‌న కూతురు అమాయ‌కురాల‌ని, తాను చ‌దువు కుంటోంద‌ని , అలాంటి అమాయ‌కురాలిపై అభాండాలు వేస్తారా అంటూ వాపోయింది. ఆపై క‌న్నీళ్లు పెట్టుకుంది కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) .

ఆదివారం జాతీయ మీడియా ఏఎన్ఐతో ఆమె మాట్లాడారు. త‌న 18 ఏళ్ల కూతురు పై చేసిన వ్యాఖ్య‌లు నిరాధార‌మ‌ని పేర్కొన్నారు.

రాజ‌కీయంగా త‌న‌ను ఎదుర్కోలేక ఇలాంటి చౌక‌బారు, నీతి మాలిన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ స్మృతీ ఇరానీ ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా అనుచిత కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నాయ‌కులు ప‌వ‌న్ ఖేరా, జైరాం ర‌మేష్ , నెట్టా డిసౌజా , కాంగ్రెస్ పార్టీల‌కు లీగ‌ల్ నోటీసులు పంపించిన‌ట్లు చెప్పారు.

ఈ విష‌యాన్ని ఆమె అధికార‌కంగా ధ్రువీక‌రించార‌. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని స్మృతీ ఇరానీ డిమాండ్ చేశారు. వెంట‌నే అమ‌లులోకి వ‌చ్చేలా ఆరోప‌ణ‌ల‌ను ఉప‌సంహ‌రించు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు స్మృతీ ఇరానీ(Smriti Irani) . గోవాలో త‌న కూతురు అక్ర‌మంగా రెస్టారెంట్ , బార్ న‌డుపుతోందంటూ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆమె నిప్పులు చెరిగారు.

Also Read : పార్థ ఛ‌ట‌ర్జీ అరెస్ట్ పై జోక్యం చేసుకోం

Leave A Reply

Your Email Id will not be published!