Smriti Irani : త‌ప్పి పోలేదు ఇక్క‌డే ఉన్నా – స్మృతీ ఇరానీ

స్మృతి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్

Smriti Irani : భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) క‌నిపించ‌డం లేదంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేసింది. ఇది క‌ల‌క‌లం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు స్మృతీ ఇరానీ. తాను పారిపోయే వ్య‌క్తిని కానంటూ పేర్కొంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు తాను అమేథీలోనే ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రు ఎవ‌రిని వ‌ద్ద‌నుకున్నారో గ‌త ఎన్నిక‌ల్లో తేలి పోయింద‌ని గుర్తు చేశారు.

త‌న‌ను వ్య‌క్తిగతంగా టార్గెట్ చేయ‌డం కాంగ్రెస్ పార్టీకి ఓ అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు స్మృతీ ఇరానీ. ఏదైనా స‌మ‌స్య ఉంటే త‌న‌తో ద‌మ్ముంటే నేరుగా స‌వాల్ చేయొచ్చ‌ని సూచించారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు ఛీత్క‌రించు కుంటున్నార‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ దివ్య రాజ‌కీయ జీవి అంటూ ఎద్దేవా చేశారు. తాను ఇక్క‌డే ఉన్నాన‌ని ఇదే ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ కోసం ఎవ‌రైనా కావాలంటే ప్ర‌స్తుతం అమెరికాను సంప్ర‌దించాల‌ని సూచించారు.

ఇదిలా ఉండ‌గా ఆరు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు రాహుల్ గాంధీ. ఇవాళ ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గురించి చేసిన వ్యాఖ్య‌లు బీజేపీ శిబిరంలో క‌ల‌క‌లం రేపాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధానికి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి త‌ట్టుకోలేక పోతున్నారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్ అయ్యారు.

Also Read : SSMB28 Poster

Leave A Reply

Your Email Id will not be published!