Smriti Irani Rahul Gandhi : భారత్ పరువు తీసిన రాహుల్
నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి
Smriti Irani Rahul Gandhi : కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆమె ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఆయనకు దేశం పట్ల, ప్రజల పట్ల, సంస్కృతి, సంప్రదాయల పట్ల ఎలాంటి గౌరవం లేదని పేర్కొన్నారు. గురువారం స్మృతీ ఇరానీ(Smriti Irani) మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ నాయకుడే కాదని, ఆయన ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందన్నారు. విషయం తెలుసు కోకుండా మాట్లాడటం ఈ మధ్య అలవాటుగా మార్చుకున్నారంటూ మండిపడ్డారు స్మృతీ ఇరానీ.
ప్రత్యేకించి భారత దేశానికి సంబంధించిన ప్రతిష్టను, గౌరవాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారంటూ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు మంచి పద్దతి కాదన్నారు. ఒక నాయకుడు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి. అందుకే గత ఎన్నికల్లో అమేథిలో తన చేతిలో రాహుల్ గాంధీ చిత్తుగా ఓడి పోయారని ఎద్దేవా చేశారు.
మొహబ్బత్ కీ దుకాన్ పేరుతో రాజకీయం చేయడం పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు . ఇది ఏ రకమైన ప్రేమ అని పేర్కొన్నారు. భారత దేశాన్ని తిట్టిన వారిని కౌగిలించు కోవడం ఏం సంప్రదాయం అంటూ ప్రశ్నించారు స్మృతీ ఇరానీ. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్బంగా ఎందుకు బహిష్కరిచారంటూ నిలదీశారు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని స్మృతీ ఇరానీ.
Also Read : IND vs AUS WTC Final : ఆస్ట్రేలియా భారీ స్కోర్