Snapana Tirumanjanam : ఘనంగా స్నపన తిరుమంజనం
ఆకట్టుకున్న పుష్పాలంకరణ
Snapana Tirumanjanam : తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. అమ్మ వారికి స్నపన తిరుమంజనం(Snapana Tirumanjanam) శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర బద్ధంగా ఈ వేడుకను చేపట్టారు.
Snapana Tirumanjanam in Tiruchanuru
కంకణభట్టర్ శ్రీ మణికంఠ బట్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేన ఆరాధన, పుణ్యహ వచనం, నవకలశ అభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున ఏడు రకాల మాలలను అమ్మ వారికి అలంకరించారు. గుమ్మడి గింజలు, గోల్డ్ గ్రేప్స్, స్వీట్ కార్న్, సంపంగి, వృచి, పింక్ రోజ్ పెటల్స్, తామరపూల గింజలు, తులసి, రంగు రాళ్లతో కూడిన రోజా మాలలు అమ్మ వారికి అలంకరించారు.
స్నపన తిరుమంజనం నిర్వహించే శ్రీ కృష్ణముఖ మండపాన్ని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అపురూపమైన పుష్పాలు, యాపిల్, ద్రాక్ష, , ఆస్ట్రేలియా ఆరంజ్ తదితర ఫలాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మండపాన్ని 20 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది రెండు రోజుల పాటు శ్రమించి అలంకరించారు .
శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలోని ధ్వజ మండపం, గర్భాలయం, శ్రీకృష్ణ స్వామి వారి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామి వారి ఆలయం, వాహన , ఆస్థాన మండపం టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read : PM Modi Manda Krishna : మందకృష్ణను ఓదార్చిన మోదీ